కీవ్: వ్లాదిమిర్ పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యా మరో జనరల్‌ను కోల్పోయింది. ఖార్కివ్‌లో జరిగిన పోరాటంలో.. టాప్ కమాండర్ మేజర జనరల్ విటాలీ గెరాసిమోవ్ హతమైనట్లు ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. దీంతో వారం రోజుల్లోనే రష్యన్ ఆర్మీ రెండవ జనరల్‌ను కోల్పోవడం జరిగింది. 41వ ఆర్మీ దళానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ ఉన్నారు. ఖార్కివ్‌లో జరిగిన దాడిలో జనరల్ విటాలీతో పాటు మరికొంత మంది సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. విటాలీ మృతి గురించి ఇద్దరు రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడుకుంటున్న ఓ ఆడియోను కూడా ఉక్రెయిన్ రిలీజ్ చేసింది. రష్యాకు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉక్రెయిన్‌లో పనిచేయడం లేదని తెలుస్తోంది. జనరల్ గెరాసిమోవ్.. రెండవ చెచన్ యుద్ధంలో పాల్గొన్నారు. సిరియాలో జరిగిన రష్యన్ ఆపరేషన్‌లో విటాలీ ఉన్నారు. రష్యన్ ఆర్మీ అతనికి ప్రత్యేక మెడల్ కూడా ఇచ్చింది. వారం క్రితం ఉక్రెయిన్ ఆర్మీ దాడిలో.. రష్యాకు చెందిన మేజర్ జనరల్ ఆండ్రూ సుఖోవెట్స్కీ హతమైన విషయం తెలిసిందే.