Putin | వెనక్కి తగ్గని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ నగరంలో ప్రత్యక్షం.. సైనిక టాప్ కమాండర్‌తో భేటీ!
Russia-Ukraine | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే చాలా ఉక్రెయిన్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. యుద్ధ నేరాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేసింది.
Russia-Ukraine | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే చాలా ఉక్రెయిన్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. యుద్ధ నేరాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేసింది. అయినా, రష్యా అధ్యక్షుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం ఆకస్మికంగా ఉక్రెయిన్‌లోని మారియుపోల్ నగరంలో పర్యటించారు. ఈ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించింది.
డొనెట్స్క్ రాష్ట్రంలోకి వచ్చే ఈ నగరం గతేడాది మే నుంచి రష్యా ఆధీనంలో ఉన్నది. ఈ క్రమంలో పుతిన్ తొలిసారి క్రిమియాకు చేరుకొని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మారియుపోల్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పుతిన్ స్వయంగా కారులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతోనూ మాట్లాడారు. మరియూపోల్ బీచ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని సైనిక ఆపరేషన్ టాప్ కమాండర్‌ను సైతం కలిశారు. ఉక్రెయిన్‌లో రష్యాకు ప్రాతినిథ్యం వహిస్తున్న చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో భేటీ అయ్యారు. దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ఆన్ డాన్ కమాండ్ పోస్ట్‌లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.
పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని కోర్టు పేర్కొంది. ఉక్రేనియన్ పిల్లలను కిడ్నాప్ చేయడం తదితర నేరాలకు బాధ్యుడిని చేసింది. అయితే, ఈ ఆరోపణలను మాస్కో ఖండించింది. వారెంట్‌పై సైతం ఉక్రెయిన్ సైతం స్పందించింది. ఇది ప్రారంభం మాత్రమేనని.. వారెంట్ తర్వాత, పుతిన్‌కు ముందుముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్నారని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

