Wagner Military Group: పుతిన్‌పై తిరగబడ్డ వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ
Wagner Military Group: వాగ్నర్ మిలిటరీ సైనిక తిరుగుబాటుకు పాల్పడింది. రష్యా రక్షణ మంత్రిపై ఆగ్రహంతో ఉన్న ఆ గ్రూపు రష్యా నగరాలపై అటాక్‌కు దిగినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని నగరాల్లోనూ సెక్యూర్టీని పెంచేశారు. రష్యా ఆర్మీ అధికారుల్ని అంతం చేయాలన్న లక్ష్యంతో వాగ్నర్ గ్రూపు ముందుకు కదులుతోంది.
మాస్కో: రష్యాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పుతిన్‌కు అండగా ఉన్న వాగ్నర్ ప్రైవేటు మిలిటరీ గ్రూపు(Wagner Military Group) ఇప్పుడు తిరగబడింది. రష్యా సైన్యం, వాగ్నర్ మెర్సినరీ దళాల మధ్య అంతర్ యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రష్యా అంతటా సెక్యూర్టీని పెంచేశారు. ఇంటర్నెట్ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. మాస్కో వీధుల్లో మిలిటరీ ట్రక్కులు పహారా కాస్తున్నాయి.
శనివారం తెల్లవారుజామున రష్యా నగరమైన రోస్టోవ్ ఆన్ డాన్ నగరంలోకి వాగ్నర్ దళాలు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఓ ప్రభుత్వ బిల్డింగ్‌ను ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు చుట్టుముట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. రెండు ట్యాంక్‌లు ఆ బిల్డింగ్‌ను టార్గెట్ చేసే రీతిలో ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగర ప్రజలకు హెచ్చరికలు కూడా చేశారు. శాంతియుతంగా ఉండాలని సంకేతాలు పంపారు.
వాగ్నర్ మిలిటరీ అధినేత యవజెని ప్రిగోజిన్.. రష్యా అధ్యక్షుడిపై తిరుగుబాటు ప్రకటించినట్లు తెలుస్తోంది. రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా అతను దాడులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో సైనిక తిరుగుబాటుకు ప్రిగోజిన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్‌ను అరెస్టు చేయాలని క్రెమ్లిన్ ఆదేశాలు జారీ చేసింది. సైనిక తిరుగుబాటు కారణంపై విచారణ చేపట్టనున్నారు.
సైనిక తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఆపరేషన్ ఫోర్ట్రెస్ను చేపట్టింది. నగరాలను, ప్రభుత్వ బిల్డింగ్‌లను కాపాడుకోవాలని రష్యా చూస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాకు వాగ్నర్ దళాలు చాన్నాళ్లూ చేయూతను అందించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- mutiny
- Putin
- Russia
- russia security
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

