చైనాకు మద్దతుగా రష్యా.. భారత్‌కు మద్దతుగా అమెరికా..
బీజింగ్ వింటర్ ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గాల్వన్ ఘర్షణలో పాల్గొన్న చైనా ఆర్మీ కమాండర్ ఫబావోను ఒలంపిక్ టార్చ్‌బేరర్‌గా చైనా ఎంపిక చేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కారణంగానే తాము క్రీడల ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇక అమెరికా కూడా ఇదే మార్గంలో నడిచింది. తాము కూడా ఈ బీజింగ్ వింటర్ ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తున్నామని భారత్ ప్రకటించింది.
ఓ వైపు ఈ వ్యవహారం నడుస్తుండగానే.. కొన్ని రోజుల క్రితం రష్యా, ఉక్రెయిన్ వ్యవహారం కూడా నడుస్తోంది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పై చేయి సాధించాలని రష్యా తహతహలాడుతోంది. దీనికి అమెరికా మోకాలడ్డుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రష్యా, చైనా ఒక్కటయ్యాయి. బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ పేరుతో రష్యా చైనా గ్యాస్, చమురు ఒప్పందాన్ని కూడా చేసుకున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఓ వేదికను కూడా సృష్టించాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎటు వైపు ఉంటుంది? భారత్‌కు ఎవరు మద్దతిస్తారని ఆలోచిస్తున్న సమయంలో అమెరికా భారత్‌కు మద్దతిచ్చింది. బీజింగ్ వింటర్ ఒలంపిక్స్‌ను భారత్ బాయ్‌కాట్ చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ సమర్థించింది.
అలాగే చైనా చేస్తున్న ఆక్రమణలపై కూడా అమెరికా స్పందించింది. చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా భారత్‌కు అండగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ఫ్రాయిజ్ ప్రకటించారు. ‘చైనా-భారత్ సరిహద్దుల వివాదం నడుస్తోంది. దీనికి చర్చలు, శాంతియుత మార్గం ద్వారా ఇరు పక్షాలు చర్చించుకుంటే మేం మద్దతిస్తాం. పొరుగు దేశాలతో బెదిరింపు ధోరణితో చైనా గతంలోనూ వ్యవహరించిందని, అప్పుడు కూడా తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. తామెప్పుడూ మిత్రులకు అండగా నిలుస్తూనే వస్తున్నాం.’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ఫ్రాయిడ్ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

