మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 19,751 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,05,19,733కు చేరింది. క్రితం రోజు కూడా రష్యాలో 20,638 మంది కరోనా మహమ్మారి సోకింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే ఇటీవల రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఇవాళ్టి కేసులలో రష్యా రాజధాని మాస్కోలోనే భారీగా నమోదయ్యాయి. అక్కడ 2,739 మందికి కరోనా వైరస్ సోకింది. 1,529 కేసులతో సెయింట్ పీటర్స్బర్గ్, 1,187 కేసులతో మాస్కో రీజియన్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో 847 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 33,144 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.