లండన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు తొలి రోజే భారీ షాక్ తగిలింది. తమ లక్ష్యాలను సాధించడంలో మొదటి రోజు రష్యా విఫలమైనట్లు బ్రిటన్ అంచనా వేసింది. రష్యా సైన్యానికి చెందిన 450 మంది సిబ్బంది మృతిచెందినట్లు బ్రిటన్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ విషయాన్ని యూకే డిఫెన్స్ మంత్రి వెల్లడించారు. ఉక్రెయిన్ యోధులు పోరాడటం వల్లే రష్యా విఫలమైనట్లు ఆయన అన్నారు. పుతిన్ అహంకారాన్ని ఉక్రెయినియన్లు అణిచివేసినట్లు రక్షణమంత్రి బెన్ వాలెస్ ఆరోపించారు. రష్యా ట్యాంక్‌లు, యుద్ధ విమానాలను ఉక్రెయిన్ పేల్చివేసినట్లు ఆయన తెలిపారు. రష్యా సైనిక బలగాలకు చెందిన సుమారు 450 మంది మృతిచెందినట్లు ఆయన చెప్పారు. కీవ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డైమెర్, ఇవాన్‌కివ్ వద్ద రష్యా దళాలతో ఉక్రెయిన్ బలగాలు భీకర పోరు సాగిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రష్యాకు చెందిన సైనిక వాహనాలు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. రష్యా బలగాలు ముందుకు రాకుండా ఉండేందుకు టెటిరివ్ నది వద్ద ఉన్న బ్రిడ్జ్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన విమానాలను రష్యా బ్యాన్ చేసింది.