Russia Invansion | రష్యా నుంచి విదేశాలకు నగదు బదిలీపై పుతిన్ నిషేధం!
Russia Invansion | స్విఫ్ట్ సేవల నుంచి రష్యన్ బ్యాంకుల తొలగింపునకు ప్రతీకారంగా విదేశాలకు నగదు బదిలీపై పుతిన్ నిషేధించారు.
Russia Invansion | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి విదేశాల్లోని బ్యాంకులకు నగదు ట్రాన్స్ఫర్ చేయడంపై నిషేధం విధించారు. బ్రిటన్, అమెరికా తదితర దేశాలు.. రష్యా, రష్యా బ్యాంకులపై స్విఫ్ట్ సేవల నుంచి బహిష్కరణ వేటు వేశాయి. దీనికి ప్రతీకారంగా, రష్యన్లు విదేశాలకు నగదు బదిలీ చేయకుండా పుతిన్ నిషేధించారు.
రష్యా, రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ సేవలనుంచి బహిష్కరించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం సారధ్యం వహించింది. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా స్విఫ్ట్ సేవల నెట్వర్క్ నుంచి ఈయూ దేశాలు బహిష్కరించాయి.
భారత్‌తోపాటు 200కి పైగా దేశాల్లో స్విఫ్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల బ్యాంకులకు స్విఫ్ట్ సేవలు లభిస్తున్నాయి. స్విఫ్ట్ సేవలతో అంతర్జాతీయ ఆర్థిక సేవలు స్మూత్‌గా సాగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

