మాస్కో: యెవ్జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటును (Russia coup) అణిచివేసేందుకు రష్యా ఆర్మీ రంగంలోకి దిగింది. వోరోనెజ్ హైవే పై ఉన్న వాగ్నర్ గ్రూపు సైనిక వాహన శ్రేణిపై ఆర్మీ హెలికాప్టర్లు దాడులు చేశాయి. బాంబులు వేయడంతో కొన్ని సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే వోరోనెజ్లోని ఆయిల్ డిపోపై కూడా ఆర్మీ హెలికాప్టర్ బాంబు దాడి చేసింది. దీంతో భారీగా మంటలు వ్యాపించగా పొగలు దట్టంగా అలముకున్నాయి. సుమారు వందకు పైగా ఫైర్ ఇంజిన్లతో ఆ మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వోరోనెజ్ ప్రాంత గవర్నర్ తెలిపారు.
కాగా, ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న రోస్టోవ్లో కూడా పేలుళ్లు జరిగాయి. దీంతో అక్కడి జనం భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మరోవైపు రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు వాగ్నర్ గ్రూప్ ఆ నగరం అంతటా యాంటీ ట్యాంక్ మైన్లను ఏర్పాటు చేస్తున్నది. అయితే స్థానిక ప్రజలు కొందరు వాగ్నర్ గ్రూప్ సైన్యానికి ఆహారం, తాగునీరు ఇచ్చారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
⚡️Russian airforce targeting a convoy of Wagner equipment on the M-4 highway in Voronezh region this morning pic.twitter.com/4tpgVqjYmx
— War Monitor (@WarMonitors) June 24, 2023
WATCH: Helicopters attack oil depot in Russia's Voronezh pic.twitter.com/0TBSmbnnx5
— BNO News (@BNONews) June 24, 2023
⚡️People fleeing after an explosion was heard in the centre of Rostov moments ago pic.twitter.com/OaopdTCBat
— War Monitor (@WarMonitors) June 24, 2023
Locals in Rostov have begun bringing food and drink for Wagner fighters.pic.twitter.com/LmvCS90kwY
— The Spectator Index (@spectatorindex) June 24, 2023