Russia | మంచు కరగడంతో రష్యాలో వరదలు.. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన నీటి మట్టాలు
Russia | గత కొన్ని రోజులుగా రష్యా (Russia)ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది (Melting Snow Swells Rivers).
Russia | గత కొన్ని రోజులుగా రష్యా (Russia)ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది (Melting Snow Swells Rivers). దీంతో ఉరల్ పర్వతాల్లో ( Ural Mountains) రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. వరద ప్రవాహానికి పలు డ్యాములు కొట్టుకుపోయి ఆ నీరంతా నివాస ప్రాంతాల్లోకి పోటెత్తుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఉరల్ నది పరిసన ప్రాంతాలు సహా సైబీరియా, కజకిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. సుమారు లక్ష మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కజకిస్థాన్ సరిహద్దులోని ఒరెన్‌బర్గ్ ప్రాంతం వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 10 వేల ఇళ్లు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. మంచు కరగడం వల్ల సాధారణం కంటే అత్యధికంగా వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
ఉరల్ నది మరింత ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఆ వేడికి మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 39 ప్రాంతాల్లో 10,400 కంటే ఎక్కువ ఇళ్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది.
Also Read..
AAP | ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం : ఢిల్లీ మంత్రి అతిశీ
Family Visa | యూకే ఫ్యామిలీ స్పాన్సర్ వీసా మరింత కఠినతరం.. ఆదాయ పరిమితి 55 శాతానికి పెంపు
Bengaluru cafe blast | బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ఇద్దరు కీలక నిందితులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

