Titan Submersible: టైటాన్ సబ్ శకలాలను గుర్తించిన రోబో వెహికిల్ ఇదే..
Titan Submersible: టైటానిక్ నౌక శకలాలకు 480 మీటర్ల దూరంలో టైటాన్ సబ్ శకలాలను గుర్తించారు. రోబోటిక్ ఆపరేటింగ్ వెహికిల్ ఆ శిథిలాలను పసికట్టింది. టైటాన్ సబ్‌లో జరిగిన అంతర్ పీడనం వల్లే ఆ సబ్ పేలి ఉంటుందని భావిస్తున్నారు. సబ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి బంధువులు, మిత్రులు నివాళ్లు అర్పిస్తున్నారు.
న్యూయార్క్: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో టైటాన్ సబ్(Titan Submersible) అంతర్ పీడనంతో పేలిన విషయం తెలిసిందే. ఆ సబ్ శకలాలను కెనిడియన్ డీప్ ఎనర్జీకి చెందిన రోబో వెహికిల్ గుర్తు పట్టింది. రిమోట్ ఆపరేటింగ్ వెహికిల్‌గా దీన్ని పిలుస్తున్నారు. టైటానిక్ నౌక శకలాలకు దాదాపు 480 మీటర్ల దూరంలో పడి ఉన్న టైటాన్ సబ్మెర్సిబుల్ శకలాలను ఈ రోబో పసికట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. టైటాన్‌ను సముద్ర ఉపరితలంపైకి తీసుకువచ్చే సామర్థ్యం ఈ రోబోకు ఉన్నట్లు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కోస్టు గార్డులు రోబో ద్వారా సబ్‌కు చెందిన అయిదు మేజర్ భాగాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదివారం మిస్సైన మినీసబ్ కోసం అయిదు రోజుల పాటు గాలించారు. టైటాన్ కోసం దాదాపు 20 వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రాన్ని అన్వేషించాల్సి వచ్చింది. పీడనం వల్ల పేలుడు(ఇంప్లోజన్) జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిర్మాణంలో స్వల్ప లోపం ఉన్నా.. సముద్ర వత్తిడికి ఆ సబ్ పేలి ఉండే అవకాశాలు ఉన్నాయి. తేడా ఏమున్నా మిల్లీసెకండ్లోనే అది పేలిపోతుందని అంటున్నారు. సబ్‌లో ఏం జరుగుతుందో తెలియకముందే అందులో ఉన్నవాళ్లు జలసమాధి అయ్యే ఛాన్సు ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

