పాకిస్థాన్‌లో బస్సు బోల్తా .. 13 మంది దుర్మరణం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా దక్షిణ సింద్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మందికిపైగా గాయాలయ్యాయి. బస్సు ముల్తాన్ నుంచి కరాచీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును క్రేన్ సాయంతో పైకి ఎత్తి వాహనంలో చిక్కుకుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుక్కూర్ సివిల్ హాస్పటల్, పాలోఅకిల్ తాలూక హాస్పటళ్లకు తరలించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తరలిస్తున్న నేపథ్యంలో సుక్కూర్, రోహిర్ దవాఖానల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

