లండన్, ఆగస్టు 6: వలసదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అల్లర్లతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. జూలై చివరి నుంచి అక్కడక్కడ కొనసాగుతున్న ఆందోళనలు శుక్రవారం నుంలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్లో నిరసనకారులు పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరారు. చి తీవ్రరూపం దాల్చాయి. యూకే వ్యాప్తంగా ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. ఇంగ్లాండ్‌లోని ైప్లెమౌత్లో ఆందోళనకారుబర్మింగ్హామ్లోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. నార్తర్న్ ఇంగ్లడ్‌లోని రొథెర్హమ్, సెంట్రల్ ఇంగ్లండ్‌లోని టామ్‌వర్త్ పట్టణాల్లో వలసదారులు నివసిస్తున్నారని భావిస్తున్న హోటళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. పలు నగరాల్లో ప్రభుత్వ ఆస్తులను, వాహనాలను ధ్వంసం చేశారు. కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడిన 370 మందిని అరెస్టు చేశారు.
ఎందుకు మొదలయ్యాయి ?
గత సోమవారం ఉత్తర ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు అమ్మాయిల హత్య జరిగింది. ఈ హత్యలను ఒక ముస్లిం వలసదారుడు చేశాడనే ప్రచారం జరగడంతో ఆగ్రహ జ్వాలలు అంటుకున్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా రైట్‌వింగ్ సంస్థలు నిరసనలకు దిగాయి. తాజా ఆందోళనలతో స్టార్మర్ ప్రభుత్వానికి తొలి సవాల్ ఎదురైంది. బ్రిటన్‌లో అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీచేసింది.