జెరూసలేం, డిసెంబర్ 16: గుండె ఆగిపోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అధునాతన సాంకేతికతను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికత. ఈసీజీ టెస్టును విశ్లేషించి గుండె ఆగిపోయే ముప్పును ఇది ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. మైయోసైటిస్ బాధితులకు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మైయోసైటిస్ బాధితుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. 2000 నుంచి 2020 మధ్య 89 మంది మైయోసైటిస్ బాధితుల ఈసీజీ రిపోర్టులు, మెడికల్ రికార్డులను పొందుపర్చి ఈ ఏఐ సాంకేతికతను రూపొందించినట్లు శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన రాంబం హెల్త్ కేర్‌కు చెందిన డా.షహర్ పేర్కొన్నారు.