పెన్సిల్వేనియా: సంతానోత్పత్తిలో కీలకంగా వ్యవహరించే, పురుషుల్లో ఉండే వై-క్రోమోజోములపై అధ్యయనంలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వై- క్రోమోజోముల పూర్తి జన్యు క్రమ చిత్రాన్ని ఆవిష్కరించారు. 62 మిలియన్ల డీఎన్ఏ జతల పరిణామ క్రమాన్ని గుర్తించారు.
సాధారణంగా పురుషుల్లో వయసు పెరిగేకొద్దీ వై-క్రోమోజోముల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వస్తుంది. తాజా ఫలితాలతో పురుషుల్లో వచ్చే క్యాన్సర్లు, సంతానోత్పత్తి సమస్యలకు మెరుగైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు తెలిపారు.