వాషింగ్టన్, జూలై 12 : యూఎస్ రిపబ్లికన్ సెనేటర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు లిండ్సే గ్రాహం (71) శనివారం ఆకస్మికంగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆకస్మికంగా వచ్చిన స్వల్ప అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. లిండ్సే ఆకస్మిక మరణం పట్ల బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో ఉండగా, ఆయన మరణాన్ని ఇరాన్ స్వాగతించింది.
ఇరాన్ చర్యతో లిండ్సే మరణంపై దేశ వ్యాప్తంగా కుట్ర సిద్ధాంతాలు వెలువడ్డాయి. ‘యుద్ధోన్మాది, ఇరాన్ వ్యతిరేకి అయిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహంను నరకానికి పంపినందుకు ఇరాన్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా.’ అని ఇరాన్ మీడియా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు ఆయన తమ లక్ష్యమని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆయనకు విషం పెట్టి చంపారని, ఇరాన్ లేదా రష్యా హత్య చేశాయంటూ సామాజిక మాధ్యమంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి.