ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఇప్పటికే రెండు వేవ్‌లను చవిచూసిన జనం.. తాజాగా మూడో వేవ్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒమిక్రాన్ రూపంలో మూడో వేవ్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ప్రపంచంలో ఉన్న ఏ మూలను కరోనా వదలడం లేదు. చివరకు అంటార్కిటికాను కూడా కరోనా వదల్లేదు. అక్కడ ఉన్న రిమోట్ అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్(remote Antarctica research station)ను కరోనా చుట్టుముట్టింది.
దాన్నే ఐస్ స్టేషన్(Ice Station) అని కూడా అంటారు. అందులో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు కరోనా సోకినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
బెల్జియానికి చెందిన రీసెర్చ్ సిబ్బంది అంటార్కిటికాలో ఉన్న ప్రిన్సెస్ ఎలిజబెత్ పోలార్ స్టేషన్లో రీసెర్చ్ చేస్తున్నారు. అందులో ఉన్న 15 మంది సభ్యుల్లో 16 మందికి గత సంవత్సరం డిసెంబర్ 14 నుంచి కరోనా సోకిందట.
25 మంది సభ్యులు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ వాళ్లకు కోవిడ్ సోకడంతో వాళ్లను ఐసోలేషన్‌కు పంపినట్టు రీసెర్చ్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన వాళ్లు ఎవ్వరికీ పెద్దగా లక్షణాలు లేవని.. అన్నీ స్వల్ప లక్షణాలేనని తెలిపారు.
ఐస్ స్టేషన్లోనే కరోనా సోకిన సైంటిస్టులకు ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. అక్కడే వాళ్లు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొదటి కరోనా కేసు డిసెంబర్ 14న నమోదు అయింది. వారం ముందే ఆ సైంటిస్టు రీసెర్చ్ సెంటర్‌కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
2009 నుంచి అంటార్కిటికాలో ఇంటర్నేషనల్ పోలార్ ఫౌండేషన్ ద్వారా ఈ ఐస్ స్టేషన్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈస్టేషన్లో ఎక్కువగా బెల్జియం సైంటిస్టులు రకరకాల పరిశోధనలు చేస్తుంటారు.