పరేడ్ చేస్తున్నవారిని ఢీకొట్టుతూ.. బీభత్సం సృష్టించిన కారు.. వీడియోలు

విస్కిన్సన్: అమెరికాలోని విస్కిన్‌సన్‌లో ఓ ఉన్మాది కారుతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్ పరేడ్‌ను టార్గెట్ చేశారు. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. కొందరు మరణించినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 20 మంది చిన్నారులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఓ ఎస్యూవీ కారు.. పరేడ్ తీస్తున్నవారిని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. విస్కిన్సన్లోని వౌకేషా నగరంలో ఈ ఘటన జరిగింది. తాజా ఘటన ఉగ్రవాద ప్రేరేపితం కాదని పోలీసులు చెబుతున్నారు. కారుతో దాడి చేసిన ఘటనలో అయిదుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
⚠️ Warning Graphic Images⚠️
— Sweet Pop Culture (@SweetPopCulture) November 22, 2021
I can’t imagine living in America and not able to have parades anymore cause of lunatics. 😞#Waukesha #Wisconsin
https://t.co/lYCUFM8j34
పరేడ్‌లో పాల్గొన్న డ్యాన్స్ టీమ్‌పై కారు దూసుకువెళ్లింది. ఫుల్ స్పీడ్‌లో వచ్చిన కారు.. పరేడ్ దారిలో భయానకం సృష్టించింది. మార్చింగ్ చేస్తున్నవారిపైకి వెళ్లింది. రెడ్ ఎస్‌యూవీని పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పరేడ్ మీదకు కారు దూసుకువస్తున్న సమయంలో పోలీసులు ఆ కారుపై కాల్పులు జరిపారు. ఈ కేసు విచారణలో ఎఫ్‌బీఐ సహకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
వౌకేషా సిటీలో 58వ వార్షికోత్సవం క్రిస్మస్ పరేడ్‌ను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. చరిత్రాత్మకమైన ఆ నగరంలో ఉన్న కొన్ని వీధుల్లో ఆ ఊరేగింపు సాగనున్నది. పరేడ్‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ముందే రిలీజ్ చేశారు. పరేడ్ ఘటనకు చెందిన విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

