High Temperatures | మెల్బోర్న్, మార్చి 2 : ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. ఎండలు మిగతా వయస్కులపైనా ప్రభావం చూపినప్పటికీ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఎక్కువ కాలం తీవ్రమైన ఎండలకు గురైతే వృద్ధుల్లో వృద్ధాప్యం రెండేండ్లు ముందుగానే వేగవంతం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్రన్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు.
సుమారు 68 ఏండ్లు పైబడిన 3700 మందిని పరిశీలించాక వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎండల కారణంగా జీవ గడియారంలో మార్పులు వస్తాయని, 2.48 సంవత్సరాలు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని గమనించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వేల మంది వృద్ధుల రక్త నమూనాల్లో ఎపిజెనిటిక్(జన్యు ప్రవర్తన) మార్పులను గమనించాక వారు ఈ విషయాన్ని వెల్లడించారు.