శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 09:00:36

ఉగ్రమూక చెరలో భారీ గ్యాస్‌ నిక్షేపాలు!

ఉగ్రమూక చెరలో భారీ గ్యాస్‌ నిక్షేపాలు!

మొసిమ్‌బోవా: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లోని మొసిమ్‌బోవా నౌకాశ్రయాన్ని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు ఆక్రమించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు ఆరువేల కోట్ల డాలర్ల విలువజేసే భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి పోర్టు కోసం మొజాంబిక్‌ ప్రభుత్వ దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గత కొంతకాలంగా భీకర పోరాటం జరుగుతున్నదని మొజాంబిక్‌ సైనికదళం ఎఫ్‌డీఎస్‌ వెల్లడించింది.

ఈ పోరాటంలో ఇప్పటివరకూ భారీ సంఖ్యలో సైనికులు మరణించారని, మరోవైపు 60 మంది వరకు ఉగ్రవాదులు కూడా హతమైనట్టు పేర్కొంది. ఇస్లామిక్‌ స్టేట్‌ తరుఫున పనిచేస్తున్న అహ్లు సున్నాహ్‌ వా జమా సంస్థ పోర్టును ఆక్రమించినట్టు వివరించింది. కాగా ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న ఓ భారీ గ్యాస్‌ క్షేత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ సంస్థ నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులు ఈ గ్యాస్‌ నిక్షేపాలపై దృష్టి పెట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.logo