న్యూఢిల్లీ, జూన్ 20: ‘ఎన్నాళ్లనీ అమెరికాపై ఆధారపడతాం.. ఇకనైనా యూరోపియన్ దేశాలు స్వయం ప్రతిపత్తి వైపు అడుగులు వేద్దాం. అమెరికా జెట్ల వైపు కాకుండా మన యూరప్‌లోనే తయారైన రాఫెల్ విమానాన్ని ప్రోత్సహిద్దాం.. ఆత్మనిర్భర్ యూరప్ సాధిద్దాం’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఫోన్ స్క్రీన్‌పై ‘రాఫెల్ నుంచి కాల్’ వస్తున్నట్టు ఉండగా, కింద యూరప్‌ను రక్షించుకుందాం అన్న ఇమేజ్ను మాక్రాన్ పోస్ట్ చేశారు. యూరోపియన్ దేశాలు అమెరికన్ ఫైటర్ జెట్లపై ఆధారపడటంపై పునరాలోచించుకోవాలని ఉద్బోధించారు.