Putin | మాస్కో, ఫిబ్రవరి 29: ఉయిన్కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోమారు హెచ్చరికలు జారీచేశారు. తమ సైనిక బలగాలను ఉక్రెయిన్క్రెకు పంపితే అణుయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. పాశ్చాత్య దేశాల్లో దేన్నైనా టార్గెట్ చేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. గురువారం రష్యా పార్లమెంట్లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపరిచేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నాటో సభ్య దేశాల కూటమి ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బలగాలను పంపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తాజాగా సూచించారు. ఈ సూచనను అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇతర దేశాలు తిరస్కరించాయి. మేక్రాన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొనే పుతిన్ ప్రస్తుత ప్రకటన చేశారని తెలుస్తున్నది.
రష్యా ఆర్మీలో పనిచేస్తున్న 20 మంది భారతీయులు తమను రక్షించాలంటూ భారత అధికారులకు విజ్ఞప్తులు చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. వారిని సాధ్యమైనంత త్వరలో భారత్ రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.