మాస్కో: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో ఉన్న లుహాన్స్క్ ప్రాంతాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే లుహాన్స్క్ ప్రాంతానికి విముక్తి కల్పించిన దళాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు. రక్షణ మంత్రి సెర్గీ షోగూతో కలిసి టీవీలో పుతిన్ సందేశం ఇచ్చారు. లుహాన్స్క్ ప్రాంత ఆపరేషన్‌లో నిమగ్నమైన బలగాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కానీ మిగితా ప్రదేశాల్లో ఉన్న మిలిటరీ యూనిట్లు మాత్రం ఫైటింగ్‌ను కొనసాగించాలన్నారు. లుహాన్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా నిలిచిన ఇద్దరు జనరల్స్‌కు హీరో ఆఫ్ రష్యా అవార్డును పుతిన్ ప్రకటించారు. లుహాన్స్క్ ప్రాంతంలోని ముఖ్యమైన లిసిచాన్స్క్ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు ఆదివారం రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు నల్ల సముద్రంలోని స్నేక్ ఐల్యాండ్‌ను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ అక్కడ తమ జెండాను ఎగురవేసింది. గత వారం స్నేక్ ఐల్యాండ్‌ను వదిలి వేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. బోర్డర్ వద్ద ఉన్న బెల్గరోడ్ నగరంపై ఉక్రెయిన్ క్లస్టర్ మిస్సైళ్లతో దాడి చేసినట్లు రష్యా ఆరోపించింది.