మాస్కో, డిసెంబర్ 16: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పుతిన్ మద్దతుదారులు ఆయనను శనివారం అధికారికంగా నామినేట్ చేశారని స్థానిక ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొన్నది.