మాస్కో: ఇవాళ ఫెడరల్ అసెంబ్లీ(Federal Assembly)ని ఉద్దేశించిన రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రసంగించారు. ఉక్రెయిన్పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆయన అన్నారు. పదేపదే ఆయన ఆ ఆరోపణలే చేశారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని, తూర్పు దేశాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సమస్యను.. పశ్చిమ దేశాలు ప్రపంచ సమస్యగా మారుస్తున్నాయని ఆయన విమర్శలు చేశారు.
ఉక్రెయిన్(Ukraine), డాన్బాస్.. అబ్దాలకు గుర్తులుగా మారాయన్నారు. నాటో దళాన్ని పెంచుతూ.. పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని, వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించామన్నారు. కానీ పశ్చిమ దేశాలు క్రూరపద్ధతిలో వ్యవహరించిందన్నారు.
సైనికులకు, వాళ్ల కుటుంబాలకు పుతిన్ థ్యాంక్స్ తెలిపారు. శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఫ్రంట్లైన్ పోరాడినవాళ్లకు, టీచర్లకు, బిల్డర్లకు, రైతులకు కూడా పుతిన్ థ్యాంక్స్ తెలిపారు.
పుతిన్ తన ప్రసంగంలో ఎల్జీబీటీ హక్కుల గురించి మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. ఫ్యామిలీ అంటే ఆడ, మగ కలయిక అని, ప్రతి మత గ్రంథాలు ఈ విషయాన్నే చెబుతాయని, కానీ ఆ పవిత్ర గ్రంథాలను పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయన్నారు. దిగజారుడతనం నుంచి మన చిన్నారుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ తెలిపారు.