WATCH: పంజాబ్ యువకుడ్ని… అమెరికాలో కాల్చి చంపిన దుండగుడు
ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్ చేశారు.
వాషింగ్టన్: అమెరికాలో కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడ్ని ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్జియాలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్, అమెరికాలోని జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆఫ్రికా జాతీయుడైన ఒక వ్యక్తి పట్టపగలు తుపాకీతో ఆ షాప్‌లోకి ప్రవేశించాడు. పరమ్‌వీర్ సింగ్‌ను బెదిరించి డబ్బులు దోపిడీ చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కంప్యూటర్ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు.
కాగా, ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు పరమ్‌వీర్ సింగ్ మృతదేహం పంజాబ్‌లోని సొంత గ్రామమైన ధాపై చేరుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒక్కడే కుమారుడైన పరమ్‌వీర్ సింగ్ మరణాన్ని వారు తట్టుకోలేపోతున్నారు. మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు చెందిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/indiacom/status/1570357344122589184?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570357344122589184%7Ctwgr%5Ef1b41748f83bc32dfe59abbd816e88ae5404dfa2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fnews%2Fworld%2Fviral-video-punjab-youth-shot-dead-inside-us-grocery-store-in-georgia-horrific-video-emerges-watch-5633166%2F
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

