లండన్లోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనను ఖలిస్థానీలు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీల హత్యలు, దాడులకు నిరసనగా బంగ్లాదేశీ హిందూస్, బ్రిటిష్ హిందూస్ ఆధ్వర్యంలో లండన్లోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు.
అదే సమయంలో భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఖలీస్థానీలు వారి ఆందోళనను అడ్డుకున్నారు. ఖలీస్థానీల చర్యను హిందూ సంఘాలు ఖండించాయి.