న్యూయార్క్: అమెరికా శ్వేతసౌధం వాణిజ్య సలహాదారుడు పీటర్ నవర్రో(Peter Navarro) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండియా దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్న అంశంపై మాట్లాడుతూ బ్రహ్మణులు లాభపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలను వాడుకుని బ్రహ్మణులు లాభపడుతున్నారని, దీన్ని ఆపాలని ఆయన అన్నారు. రష్యాకు లాండ్రీగా ఇండియా మారినట్లు ఆయన ఆరోపించారు. అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలను ఇండియా సృష్టిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్లే ఇండియాపై 50 శాతం టారీఫ్ వసూల్ చేస్తున్నట్లు నవర్రో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రాఫిటీరింగ్ బ్రహ్మిన్స్ అనే పదాన్ని వాడడం చర్చనీయాంశమైంది. ఆ పదం వాడుకపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
The usage of the word Brahmin (yes elite Boston Brahmins US context am aware) by someone senior in US Administration cannot come out of the blue in India’s context, this was deliberate. So please sit out on explaining this one.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 1, 2025
శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ చేసిన వ్యాఖ్యలను శివసేన ఉద్దవ్ పార్టీ నేత ప్రియాంకా చతుర్వేది తప్పుపట్టారు. అమెరికా నేత మరీ దిగజారిపోయే తికమక స్థితిలో మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. తన ఎక్స్ పోస్టులో ఆమె కామెంట్ చేశారు. తన ఉద్దేశాన్ని వ్యక్తం చేయడానికి నవర్రో.. భారత్‌లోని ఓ కులాన్ని ఐడెంటిటీగా చూపించడం సరికాదు అని ఆమె అన్నారు. ఇది చాలా సిగ్గుమాలిన వ్యాఖ్య అన్నారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న సంపన్నులను బ్రహ్మణులని అంటారని, వారిని బోస్టన్ బ్రాహ్మిణ్ అని పిలుస్తారేమో, కానీ భారతీయ దృక్పథంలో ఓ అమెరికా నేత మాట్లాడడం సరికాదు అని ఆమె పేర్కొన్నారు. బ్రహ్మణులు లాభపడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలను సంపూర్ణంగా వివరించాలన్నారు.
“Boston Brahmin” was once a widely used term in the US to refer to the American New England wealthy elite. “Brahmin” is still a term used in the English speaking world to denote social or economic “elites” ( in this case the rich). The illiteracy on X is astonishing.
— Sagarika Ghose (@sagarikaghose) September 1, 2025
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత సాగరికా ఘోష్ కూడా తన ఎక్స్ పోస్టులో రియాక్ట్ అయ్యారు. ఒకప్పుడు బోస్టన్ బ్రహ్మిన్స్ అని అమెరికాలో ఆ పదాన్ని వాడేవారని, అమెరికాలో ఉన్న ఇంగ్లండ్ సంపన్నులను ఉద్దేశిస్తూ ఆ పదాన్ని వాడేవారని, సామాజికంగా.. ఆర్థికంగా సంపన్నంగా ఉన్నవారిని సూచించేందుకు ఇంగ్లీష్‌లో ఇప్పటికీ బ్రహ్మిణ్ అనే పదాన్ని వాడుతుంటారని ఘోష్ తెలిపారు. అత్యంత సంపన్న వర్గాన్ని కూడా బ్రహ్మిన్ అనే పదంతో పిలుస్తారని, బీజేపీ ప్రతినిధులు దీన్ని అర్థం చేసుకోవాలని టీఎంసీ నేత సాకేత్ గోఖలే అన్నారు.