Prince Harry | అయిష్టంగానే రాజు పట్టాభిషేకానికి.. రాజకుటుంబానికి దూరంగా కూర్చోనున్న హ్యారీ
Prince Harry | బ్రిటన్ రాజకుటుంబంలో విభేధాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. మే 6న జరగబోయే కింగ్ చార్లెస్ 3 (King Charles III) పట్టాభిషేకం (Coronation) కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రిన్స్ హ్యారీ (Prince Harry) రాక ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయిష్టంగానే, తండ్రి కోరిక మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Prince Harry | బ్రిటన్ రాజకుటుంబంలో విభేధాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. బ్రిటన్ (Britain) రాజకుటుంబానికి దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. ఇక అప్పటి నుంచి రాజకుటుంబంపై అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మే 6న జరగబోయే కింగ్ చార్లెస్ 3 (King Charles III) పట్టాభిషేకం (Coronation) కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రిన్స్ హ్యారీ (Prince Harry) రాక ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయిష్టంగానే, తండ్రి కోరిక మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో కూడా ముందు వరుసలో కాకుండా ఎక్కడో 10 వరుసల తర్వాత రాజకుటుంబానికి దూరంగా కూర్చుంటారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.
ఈ విషయంపై రాజకుటుంబ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘యూకే ట్రిప్‌లో హ్యారీ తన కుటుంబంతో రాజీ పడే అవకాశాలు ఉండకపోవచ్చు. చార్లెస్, విలియమ్, హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో కుదరకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండవని నేను అనుకుంటున్నాను. ఆయనకు విండ్సర్స్ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని భావిస్తున్నాను. అయిష్టంగానే, తన తండ్రి కోరిక మేరకు హ్యారీ ఆ వేడుకకు హాజరవుతున్నాడు’ అని తెలిపారు.
కాగా, లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే (Abbey Church of Westminister)లో మే 6వ తేదీన బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం (coronation ceremon) అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవంలో రాజు సింహాసనాన్ని అధిష్టించే సమయంలో మాత్రమే హ్యారీ అక్కడ ఉంటారని, కేవలం 24 గంటల్లో యూకే వచ్చి, తిరిగి వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య మేఘన్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని రాజకుటుంబం ఇప్పటికే వెల్లడించింది.
ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 (Queen Elizabeth II) గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఎలిజిబెత్ మరణం అనంతరం బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం మే 6న జరగనుంది.
అమెరికా నటి అయిన మేఘన్ మెర్కెల్ (Meghan Markle)ను హ్యారీ 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముందు నుంచే మేఘన్ విషయంలో రాజకుటుంబం (Royal Family)లో విభేదాలున్నాయి. పెళ్లి తర్వాత ఇవి మరింత తీవ్రమవడంతో 2020లో హ్యారీ-మేఘన్ దంపతులు రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడ్డారు. మేఘన్ విషయంలో కుటుంబం చూపిన వివక్ష కారణంగానే తాను కుటుంబానికి దూరమయ్యానని హ్యారీ అనేకసార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ‘స్పేర్’ పుస్తకాన్ని విడుదల చేసి.. అందులో రాజకుటుంబంలో ఆయన, భార్య మేఘన్ ఎదుర్కొన్న అవమానాలు గురించి బట్టబయలు చేశారు.
Also Read..
Sudan Crisis | సుడాన్లో 72 గంటలపాటు కాల్పుల విరమణ.. అంగీకరించిన ఇరువర్గాల జనరల్స్
Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Mobile Phone Explodes | గేమ్స్ ఆడుతుండగా పేలిన మొబైల్ ఫోన్.. 8 ఏండ్ల చిన్నారి మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

