Sudan Crisis | సుడాన్లో 72 గంటలపాటు కాల్పుల విరమణ.. అంగీకరించిన ఇరువర్గాల జనరల్స్
Sudan Crisis | సుడాన్ (Sudan)పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా (America) కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది.
Sudan Crisis | సుడాన్ (Sudan)పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా (America) కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken ) వెల్లడించారు. గత 48 గంటలుగా జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు దేశవ్యాప్త కాల్పుల విరమణను అమలు చేసేందుకు అంగీకరించినట్లు బ్లింకెన్ తెలిపారు.
కాల్పుల విరమణ అంగీకారంతో సుడాన్లో చిక్కుకున్న విదేశీయులు సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మార్గం సుగమమైనట్లే. సుడాన్ ఘర్షణల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు పలు దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరు నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటినీ మూసేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న వారు స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో పలు దేశాలు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాల్పుల విరమణ అమలుతో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి సురక్షితంగా తరలించేందుకు వీలు పడినట్లైంది.
కాగా, సుడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య పది రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మొత్తం 420 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు. కాగా, ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు యూనిసెఫ్ (UNICEF) ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు పేలుళ్లతో సుడాన్‌లోని ప్రధాన నగరాలు దద్దరిల్లుతుండటంతో వేలాదిమంది సుడానీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరు బాంబు పేలుళ్లు, కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ఇండ్లలోనే తలదాచుకుంటున్నారు. మరోవైపు ఆహారం, మంచి నీళ్లు, మందులు, కరెంట్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Also Read..
Another Pee-Gate | విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన
Anand Mahindra | కృతిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

