Donald Trump: ఛార్లీ కిర్క్ హంతకుడిని పట్టుకున్నాం.. ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్
Donald Trump : ఛార్లీ కిర్క్‌ను హత్య చేసిన హంతకుడు పోలీసుల కస్టడీలో ఉన్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూయార్క్: కన్జర్వేటివ్ నేత, పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సర్ ఛార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వెల్లడించారు. ఉటా వాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న కిర్క్‌ను నిందితుడు ఓ బిల్డింగ్ రూఫ్ మీద నుంచి షూట్ చేసి పరారీ అయ్యాడు. అయితే ఆ నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నిందితుడికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే అతని సమాచారాన్ని ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్న అంశాన్ని చెప్పబోనన్నారు. కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయన్నారు.
కొన్ని క్షణాల క్రితం నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం తనకు అందినట్లు ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్థానిక అధికారులు అద్భుతంగా పనిచేసినట్లు ట్రంప్ మెచ్చుకున్నారు. కిర్క్ హంతకుడికి డెత్ పెనాల్టీ విధిస్తారని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కిర్క్ చాలా మంది వ్యక్తి అని, కానీ ఆయన హత్యకు గురికావడం సరిగా లేదన్నారు. కిర్క్‌ను హత్య చేసిన ఘటనకు చెందిన షూటింగ్ వీడియోను చూడాలని లేదన్నారు. కిర్క్‌ను అలా చూడటానికి ఇష్టం లేదన్నారు. చాలా దారుణంగా ఆ వీడియో ఉన్నట్లు తెలిసిందన్నారు. నిందితుడి తండ్రే సమాచారం ఇచ్చినట్లు ఓ దశలో ట్రంప్ పేర్కొన్నారు. షూటర్ వయసు 28 లేదా 29 ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
BREAKING: President Trump on Charlie Kirk suspected assassin: “I think, with a high degree of certainty, we have him in custody.” pic.twitter.com/wAAGegrrWI
— Fox News (@FoxNews) September 12, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

