కారాకస్: దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో (Venezuela) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) 6.2 తీవ్రతతో భారీ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల దూరంలో, రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని కొలంబియన్ జియోలాజికల్ సర్వే (ఎన్సీఎస్) తెలిపింది. భూ అంతర్భాగంలో 7.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప తీవ్రతతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
వెనిజులాలోని ప్రధాన నగరాలైన కారకాస్, మారాకైబోతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#SismosColombiaSGC Evento Sísmico Internacional – Boletín Actualizado 1, 2025-09-24, 17:21 hora local. Magnitud 6.1, Profundidad superficial, Mene Grande, Venezuela #NoticiaEnDesarrollo #Temblor #Sismo Más información: https://t.co/h4VVP0556L pic.twitter.com/e326NsGzX1
— Servicio Geológico Colombiano (@sgcol) September 24, 2025
❗️🇻🇪 – 6.3 Magnitude Earthquake Felt in Venezuela
A 6.3 magnitude earthquake struck with its epicenter located 61 km from Ciudad Ojeda, Zulia State, Venezuela.
Based on seismic data and historical tsunami records, no tsunami threat is expected for the U.S. East Coast, Gulf of… pic.twitter.com/VLqrdkCiex
— 🔥🗞The Informant (@theinformant_x) September 24, 2025
BREAKING: A powerful M6.2 earthquake has struck northwest Venezuela near Maracaibo, Zulia state.
•Depth: just 7.8 km (very shallow)
•230,000+ people felt strong to very strong shaking
•USGS: 10–100 deaths possible, major damage likely
•Tremors reached Caracas and parts of… pic.twitter.com/j3Ysx1sTK5— Sarcasm Scoop (@sarcasm_scoop) September 25, 2025