వాటికన్: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిశారు. వాటికన్ నగరంలోని అపోస్టోలిక్ ప్యాలెస్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో బైడెన్ భేటీ అయ్యారు. ఆ ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. వలసలు, మానవ హక్కులు, కోవిడ్ మహమ్మారి లాంటి అంశాలపై ఆ ఇద్దరూ ముచ్చటించినట్లు తెలుస్తోంది. దీనిపై వాటికన్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రోమ్‌లో జరిగే జీ20 సమావేశాల్లో తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా చర్చించుకున్నారు. భూగోళ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. శరణార్థులకు ఎటువంటి సహాయం అందించాల్సిన అంశాలను చర్చించారు.