వాటికన్: క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి సంబంధించిన మెడికల్ బులిటెన్ రిలీజ్ చేశారు. స్ట్రోక్‌తో పాటు హృద్రోగ సంబంధిత సమస్య వల్ల పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలు విడిచినట్లు వాటికన్ డాక్టర్లు వెల్లడించారు. వాటికన్ సిటీ హెల్త్ అండ్ హైజీన్ డైరెక్టరేట్ డాక్టర్ ఆండ్రియా ఆర్కెంగిలీ ఈ ప్రటకన చేశారు. అధికారిక మెడికల్ రిపోర్టును ఆయన రిలీజ్ చేశారు. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ థాటనోగ్రఫీ ద్వారా పోప్ మరణాన్ని ద్రువీకరించినట్లు డాక్టర్ ఆండ్రియా వెల్లడించారు. మెడికల్ రిపోర్టు ప్రకారం.. పోప్ ఫ్రాన్సిస్‌కు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. మల్టీమైక్రోబియల్ బైలాటరల్ న్యూమోనియా, మల్టిపుల్ బ్రాంకియాటిస్, హై బీపీ, టైప్ 2 డయాబిలిస్ వ్యాధులు కూడా ఉన్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అంశంపై చర్చించేందుకు మంగళవారం రోమ్‌లో కార్డినల్స్ భేటీ కానున్నారు. ఎప్పుడు పోప్ పార్దీవదేహాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికాకు తరలించాలన్న విషయాన్ని నిర్ణయించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఫ్రాన్సిస్ పార్దీవదేహాన్ని తరలించనున్నారు. అయితే బుధవారం ఉదయం కల్లా బాలిసికా చర్చి వద్దకు ఫ్రాన్సిస్ పార్దీవదేహాన్ని తరలించే అవకాశాలు ఉన్నట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి.
అంత్యక్రియలకు ట్రంప్
ప్రస్తుతం వాటికన్లో తొమ్మిది రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అంత్యక్రియలు, ఖననం.. మరణించిన నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య నిర్వహించనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ తెలిపారు. రోమ్‌లో జరిగే ఫ్యునరల్కు మెలానియాతో కలిసి వెళ్లనున్నట్లు ట్రంప్ చెప్పారు. ట్రుత్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.