రోమ్: ప్రపంచవ్యాప్తంగా సరోగసీ(Surrogacy)పై నిషేధాన్ని విధించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ విధానం చాలా హేయమైందన్నారు. ప్రెగ్నెన్సీని కమర్షియల్ చేయడం సరికాదు అని ఆయన అన్నారు. వాటికన్లో ప్రతినిధులతో జరిగిన కొత్త సంవత్సరం వేడుకలో ఆయన ఈ సందేశం వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభాలు అంతం కావాలని, శాంతి పథంలో ప్రజలు గౌరవాన్ని ఆశిస్తున్నారని ఆయన అన్నారు. గర్భంలో ఉన్న చిన్నారి.. ట్రాఫిక్కింగ్కు బలికావొద్దు అన్నారు. అయితే సరోగసీ ద్వారా తల్లి కావాలన్న కాంక్ష సరికాదన్నారు.శిశువును ఓ బహుమతిగా చూడాలని, కానీ దాంట్లో కమర్షియల్ కాంట్రాక్టు కోణం సరికాదన్నారు. ఇలాంటి విధానాన్ని బ్యాన్ చేయాలని క్యాథలిక్ చీఫ్ ప్రపంచ దేశాలను తన సందేశంలో కోరారు. సరోగసీ అనేది అమానవీయ ప్రక్రియ అని గతంలో కూడా పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.