మ్యూజిక్ వీడియో చేస్తుంటే.. పాప్ సింగర్‌ను కాటేసిన పాము

హైదరాబాద్: ఇటీవల ఓ పాము బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కాటు వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటన మరో పాప్ స్టార్‌కు కూడా ఎదురైంది. పాప్ సింగర్ మేటా ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తున్న సమయంలో పాము కాటేసింది. ఇటీవలే ఆ సింగర్ పాప్ స్టార్ జే జెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే పాము కాటుకు సంబంధించిన ఫూటేజ్‌ను తన ఇన్‌స్టా, ట్విట్టర్లో ఆమె పోస్టు చేసింది. 21 ఏళ్ల స్టార్ సింగర్ మేటా.. ఓ మ్యూజిక్ వీడియో కోసం కార్పెట్‌పై పడుకుంది. ఇక ఆమె చుట్టూ సర్పాలు నిండిపోయాయి. బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఆ సింగర్.. తన ఒంటిపై పాముల్ని వేసుకున్నది. శరీరంపై పాములు పాకుతున్న వీడియోను షూట్ చేస్తున్న సమయంలో ఓ పాము ఆ సింగర్ గదవను కాటేసింది. పాము కాటుతో ఉలిక్కిపడ్డ ఆ సింగర్ వెంటనే తన చేతుల నుంచి పామును పక్కకు తోసేసింది. ఇదంతా కెమెరాకు చిక్కింది. ఇక ఇలాంటి షూటింగ్‌లు ఎప్పడూ చేయనని ఆమె చెప్పింది. ఇప్పటికే ఆ వీడియోకు 4.8 లక్షల వ్యూవ్స్ వచ్చాయి. షూటింగ్ కోసం విషపూరిత సర్పాలను వాడలేదని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

