Walking | వార్సా : ఆరోగ్యానికి నడక మంచిదే.. కానీ ఎన్ని గంటలు నడువాలనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. కనీసం 4,000 అడుగులు వేస్తే గుండె పనితీరు బాగుంటుందని పోలాండ్ పరిశోధకులు తేల్చేశారు. పోలాండ్లోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ లాడ్జ్‌కు చెందిన పరిశోధకులు 2,27,000 మందిపై జరిపిన అధ్యయనంలో నడక వల్ల కలిగే ప్రయోజనాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
రోజుకు 4,000 అడుగులు వేస్తే ఆరోగ్య సమస్యలతో మరణించే ముప్పు తగ్గుతుందని తేలింది. 2,337కు పైగా అడుగులు వేసినా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనంలో తేలింది.