ఖతర్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పోలండ్ జట్టు ప్రత్యేక విమానంలో బయలుదేరింది.అయితే, జట్టుకు భద్రత కల్పించేందుకు ఎఫ్-16 యుద్ధ విమానాలను ఆ దేశ సర్కారు ఎస్కార్టుగా పంపింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భాగంగా ఒక క్షిపణి పోలండ్ భూభాగంలో పడటంతో, ఆటగాళ్లకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది.