PM Modi | చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టియాంజిన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి రెడ్‌కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టియాంజిన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి రెడ్‌కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ టియాంజిన్ (Tianjin)లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో (SCO summit) పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు అంటే ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో (Xi Jinping) మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Tianjin, China. He will attend the SCO Summit here.
(Video: ANI/DD) pic.twitter.com/dWnRHGlt95
— ANI (@ANI) August 30, 2025
కాగా, ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఏడేళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా (China) అధ్యక్షుడు 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నిరుడు అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌లో ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఎస్సీఓ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు 20 మందికిపైగా ప్రపంచ నాయకులకు ఆహ్వానం అందింది.
Also Read..
Jagdeep Dhankhar | మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు అప్లై చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్
Bank Holidays | సెప్టెంబర్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో 50 ఆయుధాలు కూడా వాడలేదు : ఐఏఎఫ్ అధికారి
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Pm Modi
- SCO summit
- Tianjin
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

