Zelensky | ఒక్కసారి ఉక్రెయిన్‌కి రండి.. రష్యా సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లారా చూడండి.. ట్రంప్‌కు జెలెన్స్కీ ఆహ్వానం
Zelensky | ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రం పనిచేయటం లేదు.
Zelensky | ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రం పనిచేయటం లేదు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా భీకరమైన క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది. ఆదివారం ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని సుమీ నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. రష్యా జరిపిన ఈ అత్యంత భయానక క్షిపణి దాడిలో 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 117మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) తాజాగా స్పందించారు.
తమ దేశంలో రష్యా సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు సూచించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌కి రావాలంటూ ట్రంప్‌ను జెలెన్స్కీ ఆహ్వానించారు. ఈ పర్యటనతో తమ దేశంలో పుతిన్ చేస్తున్న విధ్వంసం మీకు (ట్రంప్‌ను ఉద్దేశించి) అర్థమవుతుందని పేర్కొన్నారు. అది చూసి ఎలాంటి వారితో మీరు ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుంటారంటూ వ్యాఖ్యానించారు. ‘మా దేశాన్ని పుతిన్ పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆయనకు యుద్ధాన్ని ముగించాలని లేదు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాపై దాడులు చేస్తున్నారు. రష్యా దాడిలో అనేక మంది పౌరులు, చిన్నారులు, యోధులు ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే ముందు, చర్చలు చేపట్టేముందు మాస్కో సృష్టించిన విధ్వంసాన్ని చూసేందుకు ఒక్కసారి ఉక్రెయిన్‌కు రండి. దాడులు జరుగుతున్న ఏ నగరంలో అయినా మీరు పర్యటించొచ్చు. అది చూసైనా ఎలాంటి వారితో ఒప్పంద చేసుకున్నారో మీకే అర్థమవుతుంది’ అంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ‘ఒక సాధారణ నగరంపై రష్యా భయానకమైన క్షిపణిని ప్రయోగించింది. నివాస భవనాలు, విద్యా సంస్థలు, వీధుల్లోని కార్లు, నగరంలోని సాధారణ జీవితం అంతటినీ క్షిపణి దాడి దెబ్బతీసింది’ అని జెలెన్స్కీ చెప్పారు. రష్యా చర్యను ఖండిస్తూ అమెరికా, యూరప్ గట్టిగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రష్యాపై ఒత్తిడి తీసుకురాకుండా, శాంతి ఏర్పడదని జెలెన్స్కీ అన్నారు.
Also Read..
Russia | ఉక్రెయిన్‌పై క్షిపణి దాడి చేసిన రష్యా.. 20 మందికి పైగా సాధారణ పౌరులు మృతి
పాక్‌ను వీడిన 8.61 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు
Illegal Immigrants | తక్షణమే అమెరికా వీడండి.. అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

