శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 22:38:29

విద్యార్థి ఇంటికెళ్లాడు.. అతడి ఫ్లాట్‌ను పావురాలు ఆక్రమించాయి..!

విద్యార్థి ఇంటికెళ్లాడు.. అతడి ఫ్లాట్‌ను పావురాలు ఆక్రమించాయి..!

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఓ విద్యార్థి ఇంటికెళ్లిపోయాడు. అయితే, పోయేటప్పుడు కిటికీ పెట్టడం మరిచిపోయాడు. ఇంకేముంది అతడి ఫ్లాట్‌లోకి పావురాలు చొరబడ్డాయి. రూంలన్నీ ఆక్రమించేశాయి. ఎక్కడపడితే అక్కడ రెట్టలు వేయడంతోపాటు గుడ్లు పెట్టాయి. వస్తువులన్నింటినీ నాశనం చేశాయి.  

ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఓలువాజోర్జ్ జాన్సన్ (20) అనే విద్యార్థి ఈ పావురాల బాధితుడు. ఇటీవల అతడి వసతి సముదాయంలోని సిబ్బంది నుంచి ఒక మెయిల్‌ వచ్చింది. ఫ్లాట్‌ నుంచి వింత శబ్దాలు వస్తే వెళ్లి చూశామని, గదులన్నీ పావురాల మలంతో నిండిపోయిందని దాని సారాంశం. ఓ గదిలో అప్పుడే పుట్టిన పావురాలు కూడా కనిపించాయని చెప్పారు. విషయం తెలుసుకున్న జాన్సన్‌ షాక్‌కు గురయ్యాడు. గతవారం తిరిగి ఫ్లాట్‌కి వెళ్దామనుకున్నానని, కానీ ఇప్పుడు కొంచెం ఆగి వెళ్తానని అన్నాడు. ఇక మీదట ఎప్పుడూ కిటికీ తెరిచి ఉంచనని చెప్పాడు. రూంలో ఉన్న బట్టలు, వస్తువులు, స్నీకర్స్‌ అన్ని పనికిరాకుండా పోయుంటాయని ఆవేదన వ్యక్తంచేశాడు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo