Scary fish | వికృత ముఖంతో చేప.. కెమెరాలో బంధించిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. Photo viral
Scary fish | పియట్రో ఫోర్మిస్ అనే అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించాడు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్లో భాగంగా సముద్రంలోకి వెళ్లిన పియట్రో ఈ దెయ్యం చేప ముఖాన్ని ఫొటో తీశాడు.
హైదరాబాద్: నీటిలో జీవించే సమస్త జీవరాశికి సముద్రం నిలయంగా ఉంటుంది. సూక్ష్మదర్శినితో చూస్తే తప్ప కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ఉండే ప్రొటోజోవన్లు మొదలు భారీ తిమింగళాల వరకు ఎన్నో జీవులు సముద్ర ఆవాసం చేస్తున్నాయి. వాటిలో రంగురంగుల చేపలు, స్టార్ ఫిష్లు, ఆల్చిప్పలు, హైడ్రాలు చూడముచ్చటగా ఉంటే.. షార్క్ చేపల లాంటి కొన్ని జీవులు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి.
అలాంటి ఓ వికృత జీవికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పియట్రో ఫోర్మిస్ అనే అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించాడు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్లో భాగంగా సముద్రంలోకి వెళ్లిన పియట్రో ఈ దెయ్యం చేప ముఖాన్ని ఫొటో తీశాడు.
సముద్రం లోపలికి వెళ్లిన తనకు దూరం నుంచి అది ఒక వాటర్ఫాల్ మాదిరిగా కనిపించిందని, దాంతో మరింత దగ్గరికి వెళ్లానని పియట్రో ఫోర్మిస్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్లి చూస్తే ఓ భారీ చేప తనను తాను ఇసుకలో కప్పుకుని పడుకున్నట్లు కనిపించిందని, ఆ తర్వాత దాని ముఖాన్ని చూస్తే పరమ భయంకరంగా ఉన్నదని ఆయన చెప్పాడు. ఆ చేప ఫొటో ఇప్పుడు వైరల్గా మారిందన్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

