ఆరు వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఫిలిప్స్ కంపెనీ
Philips : స్లీప్ రెస్పిరేటర్ల రీకాల్.. ఫిలిప్స్ కంపెనీకి నష్టాలు తెచ్చింది. దీంతో ఆ కంపెనీ ఆరు వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నది. 2023లోనే సుమారు మూడు వేల మందిని ఆ సంస్థ నుంచి తొలగించనున్నారు.
హేగ్: నెదర్లాండ్స్‌కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఉద్యోగులను తొలగించనున్నది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది కష్టతరమైన సమయమని, కానీ 2025 నాటికి ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. మూడు నెలల క్రితమే నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ తయారు చేసిన స్లీప్ రెస్పిరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారీ స్థాయిలో ఆ పరికరాలను రికాల్ చేశారు.
అమ్స్టర్డామ్కు చెందిన ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది నాలుగవ త్రైమాసికంలో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. స్పలీప్ రెస్పిరేటర్ల పరికరాలను రీకాల్ చేయడం వల్ల ఆ నష్టం వచ్చినట్లు భావిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారి కోసం తయారు చేసిన రెస్పిరేటర్లలో నాణ్యత లోపం వచ్చింది. అమెరికాలో ఆ ఉత్పత్తిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పరికరాన్ని రీకాల్ చేశారు.
2023లోనే మూడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు జాకబ్స్ తన ప్రకటనలో తెలిపారు. 130 ఏళ్ల క్రితం బల్బుల కంపెనీగా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు హై ఎండ్ హెల్త్‌కేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

