Worlds Oldest Person | ప్రపంచంలో అత్యధిక వయసున్న వ్యక్తి అబద్ : శతాధిక వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే..!
Worlds Oldest Person : పెరూకు చెందిన 124 ఏండ్ల మార్సిలోనా అబద్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా భావిస్తున్నారు.
Worlds Oldest Person : పెరూకు చెందిన 124 ఏండ్ల మార్సిలోనా అబద్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా భావిస్తున్నారు. అబద్ హువాంకో ప్రాంతంలో 1900 సంవత్సరంలో జన్మించారని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్యకర జీవనశైలి అనుసరించడం, ప్రశాంతంగా ఉండటమే అబద్ దీర్ఘాయువు రహస్యమని వారంటున్నారు.
హువాంకా ప్రాంతంలోని పచ్చదనం, జంతుజాలం మధ్య ప్రశాంతంగా జీవించడమే అబద్ ఆరోగ్యానికి కారణమని పెరూ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 12 దశాబ్ధాలకు పైగా జీవన ప్రస్ధానాన్ని దాటిన అబద్ ఏప్రిల్ 5న తన 124వ బర్త్‌డేను జరుపుకున్నారని, గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధుడిగా అబద్ పేరు నమోదు చేసేందుకు తాము సాయపడతామని పెరూ అధికారులు తెలిపారు.
చగ్లాలోని ఓ చిన్న పట్టణంలో జన్మించిన అబద్ శతాధిక వృద్ధుడైనా 2019లో పెరూ ప్రభుత్వం ఆయనను గుర్తించి ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు పెన్షన్ మంజూరు చేసింది. పండ్లు అధికంగా తీసుకోవడంతో పాటు గొర్రె మాంసం తినడమే తన చురుకుదనం, ఆరోగ్యానికి కారణమని అబద్ చెబుతున్నారు. సీనియర్స్ వెల్ఫేర్ హోంలో ఉంటున్న అబద్ అక్కడే తన 124వ బర్త్‌డేను జరుపుకున్నారు.
Read More :
Nakul Nath | లోక్‌సభ తొలిదశ ఎన్నికలు.. అత్యంత ధనవంతుడిగా నిలిచిన నకుల్ నాథ్.. ఎన్ని కోట్ల ఆస్తులంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

