బెర్లిన్, జూలై 7: విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను జర్మనీ ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్త రెసిడెన్సీ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. 2022 జనవరి ఒకటి నాటికి ఎవరైతే దేశంలో ఐదేండ్లుగా ఉంటున్నారో వారంతా శాశ్వత నివాసం(పర్మినెంట్ రెసిడెన్సీ) కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
ఈ లెక్కన గత ఐదేండ్లుగా దేశంలో 1.36 లక్షలమంది విదేశీయులు ఉంటున్నట్టు తేలింది. దరఖాస్తు చేసుకొన్న వారికి తొలుత ఏడాదికాలానికి రెసిడెన్సీ స్టేటస్ వస్తుంది. ఆతర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకొంటే పర్మినెంట్రెసిడెన్సీ మంజూరు చేస్తారు.
జుబేర్ అరెస్టును ఖండించిన జర్మనీ
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్ అరెస్టును జర్మనీ తీవ్రంగా ఖండించింది.విలేకరులపై ఆంక్షలు ఆందోళనకరమన్నది.