వెల్లింగ్టన్, ఏప్రిల్ 14: ఒకసారి హార్ట్ అటాక్‌కు గురైనవారు అతి తక్కువకాలం బతికే అవకాశం ఉంటుంది. వీరిలో గుండె వైఫల్యం చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. అయితే, హార్ట్ ఫెయిల్యూర్‌కు చెక్‌పెట్టే డ్రగ్‌ను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వర్సిటీ పరిశోధకులు తయారుచేశారు.
దీనికి ‘ఏఎఫ్-130’ అని పేరు పెట్టారు. జంతువులపై జరిపిన ట్రయల్స్‌లో ఈ ఔషధం సానుకూల ఫలితాలు చూపినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన వైపాప తౌమాటరావ్ తెలిపారు. ఈ ఔషధం గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు జీవితకాలాన్ని తగ్గించే అతి నిద్రలేమి (స్లీప్ ఆప్నియా)ని నిరోధిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ డ్రగ్‌కు ఎఫ్‌డీఏ అనుమతి లభించనున్నదని తెలిపారు.