రాత్రిపూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి!
మనలో మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
వాషింగ్టన్, అక్టోబర్ 21: మనలో మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందని వెల్లడించింది.
పూర్తిగా పగటి పూట భోజనం చేసేవారితోపాటు పగలు, రాత్రి రెండు పూటలూ భోజనం చేసే అలవాటున్నవారిపై జరిపిన ఈ అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి 26%, ఆందోళన 16% అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. కేవలం పగటి పూట మాత్రమే భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుదల ఇంత స్థాయిలో ఉండదని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

