వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి నేటితో 20 రోజులయ్యాయి. అయితే ఇప్పటి వరకు రష్యా 900 కన్నా ఎక్కువ క్షిపణులను ఉక్రెయిన్పై వదిలినట్లు అమెరికా తెలిపింది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటాన్కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. రష్యా చాలా విచక్షణారహితంగా మిస్సైళ్లతో అటాక్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో రష్యా దాడికి దిగినట్లు పెంటగాన్ ఆరోపించింది. టార్గెట్ను చేధించేందుకు ఆ క్షిపణులను ఎక్కువగా వాడుతున్నట్లు ఆయన చెప్పారు. అయినా కానీ, రష్యా మాత్రం వైమానిక క్షేత్రంలో సుపీరియార్టీ సాధించలేకపోయినట్లు పెంటగాన్ వెల్లడించింది. రష్యా దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు అమెరికా చెప్పింది. ఉక్రెయిన్ దళాలు చురుకుదనం వల్ల రష్యా సైన్యం ముందుకు కదలడం లేదన్నారు.