Pakistani air hostesses | కెనడా చేరిన తర్వాత.. పాక్ ఎయిర్‌హోస్టెస్ మాయం, నోట్లో పీఐఏకు ధన్యవాదాలు
Pakistani air hostesses | పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాలో మాయమవుతున్నారు. తాజాగా కెనడాలో విమానం ల్యాండ్ అయ్యిన తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ రూమ్ నుంచి అదృశ్యమైంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు ధన్యవాదాలు చెబుతూ ఒక నోట్ ఉంచింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు (Pakistani air hostesses) కెనడాలో మాయమవుతున్నారు. తాజాగా కెనడాలో విమానం ల్యాండ్ అయ్యిన తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ రూమ్ నుంచి అదృశ్యమైంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు ధన్యవాదాలు చెబుతూ ఒక నోట్ ఉంచింది. పీఐఏలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న మరియమ్ రజా సోమవారం ఇస్లామాబాద్ నుంచి టొరంటో చేరుకున్న విమానంలో విధులు నిర్వహించింది. అయితే ఆ విమానం తిరుగు ప్రయాణంలో ఆమె డ్యూటీకి హాజరుకాలేదు. దీంతో పాక్ విమాన అధికారులు అప్రమత్తమయ్యారు. మరియమ్ బస చేసిన రూమ్‌లో వెతికారు. పీఐఏ యూనిఫామ్‌తోపాటు థ్యాంక్యూ పేరుతో ఉన్న నోట్‌ను ఆ రూమ్‌లో గుర్తించారు. ఆమె ఉద్దేశపూర్వకంగా మాయమైనట్లు పీఐఏ అధికారులు గ్రహించారు.
కాగా, పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాలో మాయం కావడం ఇదే తొలిసారి కాదు. చాలా కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. 2022లో నలుగురు, 2023లో ఏడుగురు ఫ్లైట్ సిబ్బంది కెనడాలో మాయమయ్యారు. ఈ ఏడాది జనవరిలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ కూడా కెనడాలో అదృశ్యమైంది. తాజాగా మరియమ్ రజా మాయమైంది. అదృశ్యమవుతున్న పీఐఏ ఎయిర్ హోస్టెస్‌లు కెనడాలో ఆశ్రయం పొంది అక్కడ స్థిరపడుతున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- air hostesses
- Canada
- note
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

