ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని ఖబర్ ఫక్తున్సాలో ఉన్న వందేళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని గత ఏడాది కొందరు ముస్లింలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 350 మందిపై కేసులను ఎత్తివేయనున్నట్లు మంగళవారం పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని హిందూ వర్గం క్షమించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. మార్చి 2021లో హిందూ, ముస్లిం మతపెద్దల మధ్య జిర్గా సమావేశం జరిగినట్లు హోంశాఖ తెలిపింది. అయితే అందర్నీ రిలీజ్ చేయాలంటూ రెండు వర్గాలు ఆ సమావేశంలో అంగీకరించాయని, కోర్టుకు కూడా వాళ్లు లేఖ పంపినట్లు హోంశాఖ చెప్పింది.