ఇస్లామాబాద్ : భారత్తో ఉద్రిక్తతల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో రక్షణ రంగం కేటాయింపులను 18 శాతం పెంచాలని పాకిస్థాన్లోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రక్షణ రంగానికి రూ.2.5 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరగనున్నట్లు మంగళవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.